Pages

Tuesday, January 27, 2015

లలితా మహిళామండలి మీటింగ్



 
      జనవరి ఇరవైయారున  లలితా మహిళామండలి మీటింగ్ మా సభ్యురాలు దుర్గగారింట్లో జరిగింది. అందరికీ ఆహ్లాదంగా ఆహ్వానం పలికారు ఆవిడ. ప్రోగ్రామ్ అంతా చాలా చక్కగా ప్లాన్ చేసారు దుర్గ.

 
   అందరం మధ్యాహ్నం మూడుగంటలకల్లా వాళ్ళింటికి చేరిపోయాం.  మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేద్దామని జ్ఞానప్రసూనగారిని రమ్మన్నాను. ఆవిడ ఠంచనుగా టైమ్ కి వచ్చేసారు.
     ఈసారి ప్రోగ్రామ్ లో హైలైట్ ఏమిటీ అంటే దుర్గ మా అందరకూ మంచిమాట చెప్పిద్దామనే ఉద్దెశ్యంతో ప్రొఫెసర్ సులోచనగారి ప్రసంగాన్ని ఏర్పాటు చేసారు. ఆవిడ ఎంతో హుందాగా, చక్కగా, సరళంగాస్వఛ్ఛభారత్..” గురించి వివరించారు. మనందరికీ స్వఛ్ఛమైన భారత్ కావాలీ అంటే మహిళలే దానిని సాధించగలరని చెప్పారు.  ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా దీనిమీద బాగా స్పందిస్తున్నాయనీ, వాటి సహాయంతో మహిళలు దీనిని సాధించవచ్చనీ మమ్మల్ని ఉత్తేజపరిచారు. సభ్యులందరూ వారి వారి అనుభవాలను ఆవిడతో పంచుకున్నారు.
 
 
 
 

 
 
 
 
 
      స్వఛ్ఛభారత్ గురించి చర్చించుకున్నాక దుర్గ మాకందరికీ ఎంచక్క రవ్వలడ్డూలూ, సేమ్యా ఉప్మా, సగ్గుబియ్యం,అటుకులుతో చేసిన మిక్స్చరూ పెట్టి, తియ్యటి చెరుకురసం ఇచ్చారు. రుచి అదుర్స్.
 
     ఆ తర్వాత అందరం వాళ్ళింటి వెనకాలవున్న తోటలోకి వెళ్ళాం. అక్కడ మామిడి, పనస, కోనసీమకొబ్బరిచెట్లులాంటివన్నీ చూసి, బోల్డు కబుర్లు చెప్పేసుకున్నాం.
 
 
 
 

 
 
 
             అక్కడే దుర్గ మాకందరికీ ఒక క్విజ్ పెట్టారు. అబ్బో.. పురాణాలు, గ్రంథాలనుంచీ నేటి సినిమాల దాకా ప్రశ్నలు ఉన్నాయందులో. మేమేమైనా  తక్కువ తిన్నామా.. పబ్లిక్ పరీక్షకన్నా సీరియస్ గా జవాబులు రాసిపడేసాం 
  అందులో ఫస్ట్ ప్రైజ్ గాయత్రిగారికి,
 
 
 
సెకండ్ ప్రైజ్ జ్ఞానప్రసూనగారికి వచ్చింది.



       అన్ని ఆటలూ గట్రా అయ్యాక, తర్వాత మీటింగ్ ఎప్పుడో, ఎక్కడో చెప్పుకుని ఆ కబుర్లనే తల్చుకుంటూ ఇళ్ళు చేరాం. బాగున్నాయా మా మీటింగ్ విశేషాలు..
 
-------------------------------------------------------------------------